సంక్రాంతి సంబరాల్లో భాగంగా పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బిఆర్ఎంవి మున్సిపల్ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో సోమవారం సాయంత్రం సంక్రాంతి సంబరాలు ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ టీం సభ్యులు పాల్గొని పలు రకాల ప్రదర్శనలు చేశారు. ఈ ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు వారిని అభినందించారు.