పెనమలూరు: వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
రాష్ట్రంలో పెన్షన్ దారులకు పెన్షన్ల పంపిణీని సరళతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు. ఆదివారం తాడిగడపలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రెండు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో ఆ మొత్తాన్ని చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.