పోలవరం పంచాయతీలో బుధవారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ట్రై కార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు హాజరయ్యారు. అనంతరం గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలు వారి సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.