ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం వేలూరుపాడులో బోరుగడ్డ అనిల్ పై రెండు నెలల క్రితం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఆయనను మండలానికి తీసుకురావడంతో కూటమి నాయకులు స్పందించి మాట్లాడారు. వెంటనే బోరుగడ్డ అనిల్ ను ఉరితీయాలని లేదా మాకు అప్పజెప్పండి అంటూ నినాదాలు చేశారు. అలాగే బోరుగడ్డ అనిల్ రాజకీయాల్లోకి రాకూడదు అని అన్నారు.