తాడేపల్లిగూడెం: 48 గంటల్లోనే ధాన్యం సొమ్ములు

83చూసినవారు
తాడేపల్లిగూడెం: 48 గంటల్లోనే ధాన్యం సొమ్ములు
ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాకు సొమ్ములు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం మండలం పెదతాడపల్లి రైతు సేవ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జేసి రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో ఖతీబ్ కౌసర్ బనోతో కలిసి ఆయన ప్రారంభించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్,అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్