ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా గురువారం తణుకు పట్టణంలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ (ఆర్ట్స్) ప్రభుత్వ కళాశాల నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు ఏర్పాటు చేసిన పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఐదేళ్ళ లోపు పిల్లలు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.