తిరువూరు ఎమ్మెల్యే నా మజాకా...!
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆదివారం విశాఖపట్నం మాదిగ ఎంప్లాయిస్ వన సమారాధన కార్యక్రమానికి వెళుతూ, మార్గమధ్యంలో కారు ఆపారు. హుస్సేన్ పేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో రైతు కూలీలతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం వారితో కలిసి పొలాల్లోనే భోజనాలు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. చూసిన వారంతా తిరువూరు ఎమ్మెల్యే నా మజాకా అన్నారు.