తిరువూరు: రైతుల సమస్యలను పరిష్కరించిన ఎమ్మెల్యే
తిరువూరు పట్టణంలో గల సోము గుంట, కొత్తచెరువు రైతుల సాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులపై తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు శుక్రవారం స్పందించారు. తిరువూరు ఎన్ఎస్పి కెనాల్ ప్రాజెక్ట్ చైర్మన్ గుర్రం నరసింహారావు ఆధ్వర్యంలో టిసి నెంబర్ 8 లో గల సాగునీరు వెళ్లే కాలువను ఆధునీకరణ చేసినట్లుగా తెలిపారు. రైతులకు సాగునీరు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లుగా తెలిపారు.