కాళ్ళ మండలం కాళ్ళకూరు గ్రామంలో నూతనంగా ప్రారంభించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే కనుమూరు రామకృష్ణంరాజు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.