ఆకివీడులో పునుగు పిల్లి

81చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీలోని స్థానిక గంగానమ్మకోడు వీధిలో పునుగుపిల్లి ప్రత్యక్షమైంది. గ్రామంలో బావురు పిల్లుల నుంచి పందెం కోళ్లను రక్షించేందుకు బోను ఏర్పాటుచేశారు. ఈ బోనులో బుధవారం తెల్లవారుజామున పునుగు పిల్లి చిక్కింది. ఈ పిల్లి తైలాన్ని తిరుమల తిరుపతి వెంకన్న ఆలయంలో స్వామికి తైలాభిషేకాల్లో ఉపయోగిస్తారని తెలియడంతో టీటీడీ అధికారులకు సమాచారం అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్