తాళ్లపూడి మండలంలోని అన్నదేవరపేట గ్రామంలో టీడీపీ యువగళం నాయకులు ఆధ్వర్యంలో శనివారం దివంగత నేత ఎన్టీఆర్ 29 వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంచి పెట్టారు. ఈ కార్య క్రమంలో కూచిపూడి గణేష్, తొండేపూ భరత్, లకంసాని ఆదిత్య, కూచిపూడి నరేంద్ర, కూచిపూడి తేజ, తొండేపు వినోద్, పల్లి ప్రకాష్, పెనుగొండ బంగారు బాబు, పేరూరి రమణ తదితరులు ఉన్నారు.