ఏపీలో దోపిడీ పాలన నడుస్తోంది: ధూళిపాళ్ల

70చూసినవారు
ఏపీలో దోపిడీ పాలన నడుస్తోంది: ధూళిపాళ్ల
ఏపీలో నయా దోపిడీ పాలన నడుస్తోంద‌ని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమ‌ర్శించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు దందాకు తెరదీస్తున్నార‌ని ఆరోపించారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నార‌ని మండిప‌డ్డారు. ఏ మైనింగ్‌ నుంచి ఎంత తవ్వారో లెక్కలు ఉండవని చెప్పారు. దొంగ బిల్లులు సృష్టించి దందా చేసే పరిస్థితి నెల‌కొంద‌ని శుక్ర‌వారం మీడియాతో అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్