AP: సత్యసాయి జిల్లా హిందూపురంలో దారుణం జరిగింది. రహమత్‌పూర్‌కు చెందిన ఎస్.అల్లాబకాష్, తబస్సుం దంపతులు. భార్య తబస్సుం.. నదీముల్లా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరి వ్యవహారం భర్త అల్లాబకాష్‌కి తెలిసి తరచూ దంపతులు గొడవ పడేవారు. ఈ నెల 18న ప్రియుడితో కలిసి గాఢనిద్రలో ఉన్న భర్త గొంతుకు చున్నీచుట్టి, ఆపై గొంతు నులిమి హత్య చేసింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.