AP: రాజమండ్రిలోని లలితా నగర్ ప్రాంతానికి చెందిన నాగ మల్లేశ్‌ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు స్థానిక వీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రాజమండ్రి 3వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి నాగ మల్లేశ్‌ను అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టిన నాగ మల్లేశ్‌కు రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు.