AP: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో గత నెల జరిగిన యువతి హత్య కేసును పోలీసులు చేధించారు. ‘ఐశ్వర్య అనే యువతి విశాఖలో పని చేసేది. అప్పుడు రాంబాబుతో ఐశ్వర్యకు పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకోవాలని అడగగా.. వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆరిలోవలోని ఓ రూమ్‌లో ఐశ్వర్యను చంపి ఫ్రెండ్స్ సాయంతో బైక్‌పై తీసుకెళ్లాడు. సాలూరులోని జీడితోటలో చెట్టుకు చున్నీతో ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు.’ అని పోలీసులు వెల్లడించారు.