AP: నెల్లూరు జిల్లా వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేయనున్నారు. ఆయనపై నమోదైన కేసు విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో బుధవారం మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు. గురువారం నుంచి అందుబాటులో ఉంటానని ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. రేపు కుటుంబ శుభకార్యం ఉందని.. ఆ కార్యక్రమంలో పాల్గొని నెల్లూరుకు వస్తానని కాకాణి చెప్పడంతో, మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.