AP: మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మెగా డీఎస్సీకి ఏప్రిల్ నెలలోనే నోటిఫికేషన్ ఇస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మళ్ళీ బడులు మొదలయ్యేలోగా నియామకాలు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. తల్లికి వందనం మే నెలలో ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.