ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

73చూసినవారు
ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఢీకొన్నాయి. ఆటోలో మంటలు చెలరేడంతో ముగ్గురు మరణించగా.. ఇందులో ఇద్దరు సజీవదహనం అయ్యారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మార్కాపురం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్