AP: ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడేది లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబును విమర్శించిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం ఇలానే ప్రవర్తిస్తే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎవరికీ అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని చెప్పారు.