తొలుత చంద్రబాబు.. ఆ తర్వాత పవన్‌ ప్రమాణం

78చూసినవారు
తొలుత చంద్రబాబు.. ఆ తర్వాత పవన్‌ ప్రమాణం
AP: రేపు ఉదయం 9.46 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుండ‌గా.. ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించనున్నారు. తొలుత సీఎం చంద్రబాబు, ఆ త‌ర్వాత డిప్యూటీ సీఎం పవన్ క‌ళ్యాణ్ ప్రమాణం చేస్తార‌ని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశ‌వ్ వెల్ల‌డించారు. అనంతరం మహిళా సభ్యులు, ఇతర సభ్యులు ప్రమాణం చేస్తార‌ని తెలిపారు. అక్షర క్రమం ప్రకారం సభ్యుల సీటింగ్ ఉంటుంద‌ని వివ‌రించారు.

సంబంధిత పోస్ట్