విజయవాడను మళ్లీ వరద భయం వెంటాడుతోంది. గత రాత్రి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి విజయవాడలో రెండు అడుగుల మేర నీరు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే వెలగలేరు హెడ్ రెగ్యులేటరీ వద్ద ఎలాంటి వరద లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇవాళ వరద తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.