ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఇదే సమయంలో రాష్ట్రానికి సినీ, రాజకీయ ప్రముఖులు మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా తమ వంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సహకారం అందిస్తున్నారు. తాజాగా ఓ రోజు వారి కూలి పని చేసుకునే వ్యక్తి ముఖ్యమంత్రి సహాయ నిధికి 600 రూపాయలను విరాళంగా ఇచ్చారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఆ వ్యక్తికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.