కాకినాడ జిల్లాలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు బైక్‌పై జగ్గంపేట నుంచి రాజమహేంద్రవరానికి వస్తూ కాకినాడ జిల్లా కేంద్రంలోని మురారి వద్ద డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మోరంపూడికి చెందిన యువకులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.