AP: తిరుపతి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. పెళ్లకూరు మండలం పెన్నేపల్లిలోని స్టీల్ తయారీ కర్మాగారంలో బుధవారం అర్థరాత్రి భారీగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పలువురి కార్మికులకు గాయాలు కాగా.. మంటల ధాటికి ఫర్మీచర్ఫర్నిచర్ యూనిట్ మొత్తం కాలి బూడిదైంది. ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.