ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటన ఖరారైంది. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఉగాది నాడు వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 8వ తేదీన జగన్ పాపిరెడ్డిపల్లి గ్రామానికి చేరుకొని లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అయితే ఇప్పటికే పరిటాల వర్గం ఈ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించింది.