AP: పిఠాపురంలో మరోసారి ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొన్నాయి. MLC నాగబాబు రెండో రోజు పర్యటన చేస్తుండగా, అడుగడుగునా ఆయనను టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుమారపురంలో జైవర్మ.. జైటీడీపీ.. జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. దానికి ప్రతిగా జై జనసేన.. జై పవన్ అంటూ ప్రతి నినాదాలు చేస్తూ ఒకరునొకరు నెట్టుకున్నారు. ఈ ప్రారంభోత్సవాలకు టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు ఆహ్వనం లేకపోవడంతో ఈ నిరసనలు చేస్తున్నట్లు సమాచారం.