కడప జిల్లా కోర్టుకు మాజీ మంత్రి సోదరుడు

68చూసినవారు
కడప జిల్లా కోర్టుకు మాజీ మంత్రి సోదరుడు
వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా సోదరుడు అహ్మద్ ‌బాషాను ఆదివారం ముంబయిలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ స్థలం వివాదంలో కేసు నమోదు కావడంతో తప్పించుకొని తిరుగుతుండడంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో సుమారు 8 గంటల పాటు అహ్మద్‌బాషాను పోలీసులు విచారించారు. తర్వాత కడప రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎదుట హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్