AP: వైసీపీపై, మాజీ సీఎం జగన్‌పై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వంలో మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్‌లు వేయకుండా గత వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందని బుద్దా వెంకన్న అన్నారు. నేడు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును ఆయన కలిశారు. 'మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామిరెడ్డి తమపై దాడికి ఉసిగొల్పారు. తురక కిషోర్ తమపై దాడి చేసి చంపే ప్రయత్నం చేశారు' అని బుద్దా వెంకన్న షాకింగ్ కామెంట్స్ చేశారు.