హోం మంత్రి అనితపై వైసీపీ మాజీ మంత్రి ఆగ్రహం

561చూసినవారు
హోం మంత్రి అనితపై వైసీపీ మాజీ మంత్రి ఆగ్రహం
ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై మాజీ హోంమంత్రి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప.గో. జిల్లాలో ఆమె మాట్లాడుతూ.. అనిత చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపారు. తమ నాయకుడు వైఎస్ జగన్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఏపీలో రాజకీయ దాడులు జరుగుతుంటే హోం మంత్రి అనిత ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలని, వాళ్ల పనిని వాళ్లు చేసుకోనివ్వాలని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్