త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

53చూసినవారు
త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ హామీని నెల రోజుల్లో అమలు చేసేలా కార్యాచరణ ప్రారంభించినట్లు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాదరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌ను పరిశీలించి ప్రయాణికులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్‌లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు మంత్రిని కలిసి తమకు వేతనాలు పెంచాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్