AP: కూటమి నేతలు సంప్రదాయం ముసుగులో జూదాన్ని రాష్ట్ర క్రీడగా మార్చేశారని వైసీపీ ఆరోపించింది. 'పండుగ రోజుల్లో దగ్గరుండి మరీ ప్రతి ఊరిలో జూదం, కోడి పందేలు నిర్వహించారు. ప్రతి బరి నుంచి భారీగా కమీషన్లు వసూలు చేస్తూ నాయకులు బాగుపడ్డారు. కానీ జూదంలో డబ్బులు పోయిన వాళ్లు ఒట్టి చేతులతో ఇళ్లకు వెళ్తున్నారు. ప్రజలు ఏమైపోతేనేం తాము బాగుపడితే చాలన్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ఉంది' అని ట్వీట్ చేసింది.