పెట్రోల్‌లో ఇథనాల్ వాటాను 20 శాతానికి పెంచాలన్న లక్ష్యాన్ని మరో రెండు నెలల్లో సాధిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే విధానాన్ని కేంద్రం 2001లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఈ క్రమంలో వాహన కంపెనీలు కూడా బయో–ఇథనాల్‌తో నడిచే ఇంజిన్లను తయారు చేస్తున్నాయి. దీంతో త్వరలోనే ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని గడ్కరీ తెలిపారు.