బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలుగు హీరో ఎన్టీఆర్ స్పందిస్తూ.. విషయం తెలిసి తాను షాకయ్యానని, ఇది నిజంగా బాధాకరమని అన్నారు. ఆయన త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని పేర్కొన్నారు. మరోవైపు సైఫ్ ఫ్యాన్స్ క్షేమంగా ఉండాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.