భూకంపాల జోన్ 2లో ఏపీ, తెలంగాణ ఉన్నాయి. భూప్రకంపనలకు అవకాశం ఉన్న ప్రాంతాలను భూకంప మండలాలు (సెస్మిక్ జోన్లు) అంటారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రకారం మన దేశంలో 4 భూకంప మండలాలున్నాయి. V, IV, III, II జోన్లు ఉండగా.. జోన్ Vలో అత్యధికంగా, IIలో అత్యల్ప భూకంపాలకు అవకాశం ఉంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు రాగా ప్రజలు ఆందోళన చెందారు. మనం జోన్ 2లో ఉండటంతో అంతగా భయపడాల్సిన అవసరం లేదు.