BREAKING: టీడీపీకి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా

324856చూసినవారు
BREAKING: టీడీపీకి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా
టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా చేశారు. తన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీసినందుకే రాజీనామా చేసినట్లు గొల్లపల్లి తెలిపారు. ఈ మేరకు బుధవారం తన రాజీనామా లేఖకు చంద్రబాబుకు సమర్పించారు. టీడీపీలో నిజాయితీకి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజోలు సీటు ఇవ్వకుండా తనను అవమానించారని పేర్కొన్నారు. కాగా, గొల్లపల్లి త్వరలో వైసీపీలోకి చేరనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్