ఏపీ ప్రభుత్వం రైతులకు మళ్లీ 90 శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ఇచ్చేందుకు రెడీ అయింది. గత ప్రభుత్వం వైఎస్ఆర్ జల కళ పేరుతో దీన్ని అమలు చేసినా అవగాహన లేక రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకం ‘ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన’లో భాగంగా రాష్ట్రంలో తిరిగి అమలు చేస్తున్నారు. పథకం గురించి మరిన్ని వివరాలకు 1902 నెంబరును సంప్రదించవచ్చు.