రంగారెడ్డి జిల్లా గండిపేట(M) బండ్లగూడ జగీర్ మున్సిపాలిటీలోని కిస్మత్పురలో రోడ్డు వివాదానికి హైడ్రా ఒక్కరోజులోనే శాశ్వత పరిష్కారం చూపించింది. కిస్మత్‌పురాలో రెండు కాలనీలను కలిపే రహదారికి అడ్డంగా నిర్మించిన ప్రహరీని హైడ్రా ఉదయం కూల్చివేసి సాయంత్రానికి సీసీ రోడ్డు నిర్మించింది. ఫార్చ్యూన్ వెస్ట్ మెడోస్-శ్రీ హర్షిత్ లే ఔట్‌ల మధ్య ఉన్న ఈ రహదారి అడ్డుగోడ తొలగడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.