TG: డీలిమిటేషన్ పై కాంగ్రెస్ వైఖరి ఏంటో ఇప్పటిదాకా చెప్పలేదని మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తెలిపారు. అధికారంలో ఉన్న బీజేపీకి మేము డీలిమిటేషన్ పై చెప్పాల్సింది చెప్పాం అని అన్నారు. అఖిలపక్ష సమావేశం ఎందుకు పెట్టారో స్పష్టత లేదన్నారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని మేం ఎప్పట్నుంచో పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కంటే ముందు తామే దీనిపై గొంతెత్తాం అని వారు వెల్లడించారు.