తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. సాధారణంగా వంటల్లో చిన్నరకం ఉల్లినే ఉపయోగిస్తారు. అయితే ఈ రకం పంట దిగుబడి అమాంతం పడిపోయింది. దీంతో ఈ మధ్య కాలంలో ఉల్లి రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. మూడు నెలలకు ముందు రూ.20 ఉన్న ధర ఇప్పుడు పలుచోట్ల కిలో రూ.50 వరకూ అమ్ముతున్నారు. మున్ముందు ఈ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. కర్ణాటకలో ఇప్పటికే కిలో రూ.100కు అమ్ముతున్నారు.