నిర్మల్ జిల్లా చిట్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శశాంత్ (14) అనే బాలుడిని దుండగులు అతి కిరాతంగా హత్య చేశారు. బాలుడి మర్మాంగంపై రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు ఆనవాళ్లు లభించాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.