రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య డిమాండ్ చేసింది. గుంటూరు కొత్తపేటలోని భగత్ సింగ్ బొమ్మ సెంటర్లో శుక్రవారం విద్యార్థులు ఉరితాళ్లు బిగించుకొని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ మాట్లాడుతూ జనవరి 10 లోపు సమస్యలను పరిష్కరించని పక్షంలో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.