గుంటూరు బొంగరాల గుడిలోని రైల్వే డిపోలో గురువారం ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. డిపో జనరల్ పిటి నాయక్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలం అని కొనియాడారు. కార్యక్రమంలో రైల్వే కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.