తిరిగి వచ్చేది జగన్ ప్రభుత్వమే:మాజీ మంత్రి రజిని

61చూసినవారు
నిన్న మేము అధికారంలో ఉన్నాం. నేడు మీరున్నారు. రేపు తిరిగి మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని వైసీపీ మాజీ మంత్రి విడదల రజనీ అన్నారు. గుంటూరు లోని ఆమె క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏపీని రోల్ మోడల్ గా ఉంచాలన్న జగనన్న లక్ష్యానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని విమర్శించారు. తిరిగి రాష్ట్రంలో అధికారం చేపట్టబోయేది తామేనని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్