పొన్నూరులో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమం

554చూసినవారు
పొన్నూరులో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమం
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శనివారం స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఆరేటి రామారావు పాల్గొని మాట్లాడుతూ సంపూర్ణ స్వాతంత్రం కోసం బ్రిటిష్ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేసి అసువులు బాసిన భగత్ సింగ్ నేటి యువతకు ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్