గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం జి జి పాలెం లో గురువారం అమరవీరుడు అల్లూరి సీతారామరాజు 126వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామస్తులు ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ ఉపసర్పంచ్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ జాతి కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి అసువులు బాసిన అల్లూరి సీతారామరాజు ఆదర్శప్రాయుడని కొనియాడారు. పలువురు గ్రామ ప్రజలు ఆయనకు నివాళులు అర్పించారు.