గుంటూరు జిల్లాప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం రేటూరు గ్రామంలో మంగళవారం పశు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో పశు వైద్యాధికారి సౌమ్య పాల్గొని పశువులను పరీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పశుపోషకులు వైద్య సిబ్బంది సూచనలు పాటించి పశు సంపద పొందటం తోపాటు ఆర్ధిక స్వలంబనం సాధించాలని సూచించారు. గ్రామ సర్పంచ్ సైదా, నీటి సంఘం అధ్యక్షులు రాంబాబు, పశుపోషకులు పాల్గొన్నారు.