నల్ల ద్రాక్ష తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. నల్ల ద్రాక్ష కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, గుండె సమస్యలను నియంత్రించడంలో ఉపయోగపడుతుందని వారు అంటున్నారు. అదేవిధంగా, రక్తపోటును తగ్గించడం, ఎముకల ఆరోగ్యాన్ని సంరక్షించడం లాంటి ప్రయోజనాలను అందించగలదని చెబుతున్నారు.