కాకుమాను: వరి పై అగ్గి తెగులు నివారణ పై రైతులకు అవగాహన
కాకుమాను మండలంలోని లింగంగుంట్లపాలెం, వల్లూరు గ్రామాలలో మంగళ వారం పొలంపిలుస్తుంది కార్యక్రమం జరిగింది. మండల వ్యవసాయాధికారిణి కె. కిరణ్మయి పాల్గొని వరి పొలాలను సందర్శించి రైతుల తో మాట్లాడారు. వరి పైరుకు కంకి నల్లి కి పిప్రోనిల్లు 1మిల్లీలీటర్ ఒక లీటర్ నీటికి కలిపి పంటమీద పిచికారి చేసుకోవాలని అగ్గి తెగులుకు ట్రై సైక్లోజల్ 2జి 1లీటరు నీటికి కలిపి ద్రావణాన్ని పిచికారి చేయాలని రైతులకు సూచించారు.