కోరిశపాడు మండలం, ప్రసంగలపాడు పంచాయతీ పరిధిలో గురువారం రీ- సర్వే రెవిన్యూ గ్రామ సభ నిర్వహించారు. కార్యక్రమంలో మండల తాహశీల్దార్ జి. వి సుబ్బారెడ్డి పాల్గొని, భూములకు సంబంధించిన సమస్యలపై వినతి పత్రాలను ప్రజల నుండి స్వీకరించారు. కార్యక్రమంలో రీ - సర్వే డిప్యూటీ తాహశీల్దార్ రవికాంత్, సర్వేయర్ మహేష్ బాబు, ఆర్. ఐ కృష్ణమోహన్, వీఆర్వో రవి గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు.