బాపట్ల మండలం సూర్యలంక అడవి పంచాయితీలోని 20 సం. నుండి నివాసం ఉంటున్న 20 కుటుంబాల గిరిజనులకు గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కాలయాపన చేశారని అఖిల భారత దళిత గిరిజనుల సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులు పర్రె కోటయ్య, కచ్చర్ల వినయ్ రాజు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకట మురళీకి వినత పత్రం అందించి మీడియాతో మాట్లాడారు. అధికారుల స్పందించి గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.